అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. భారత్ సహా పలు దేశాలపై టారిఫ్‌లు ప్రకటించారు. తాజాగా మరో బాంబు పేల్చారు అధ్యక్షుడు. త్వరలోనే ఔషధ ఉత్పత్తు లపై సుంకాల మోత మోగించనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు దిగుమతయ్యే ఔషధ ఉత్పత్తులపై భారీ ఎత్తున టారిఫ్‌లు విధించనున్నట్లు తెలిపారు.

నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అమెరికాలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావడం లేదన్నారు. అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ చర్యతో చైనా సహా వివిధ దేశాల్లోని ఫార్మా కంపెనీలన్నీ అమెరికాకు తరలివస్తాయని, ఇక్కడ తమ ప్లాంట్లను తెరుస్తాయని వ్యాఖ్యానించారు.
