అమెరికా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్ తొలి రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచి చైనా దిగుమతులపై పది శాతం సుంకాన్ని విధించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆ సుంకం వసూల్ చేసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. వైట్‌హౌజ్‌లో మాట్లాడుతూ మెక్సికో, కెనడా రూట్లో చైనా అక్రమంగా సింథటిక్ డ్రగ్ ఫెంటానిల్‌ను సరఫరా చేస్తున్నట్లు ఆరోపించారు. మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై 25 శాతం పన్ను వసూల్ చేయనున్నట్లు కూడా ట్రంప్ హెచ్చరించారు. ఆ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు చెప్పారు.