Namaste NRI

చైనాకు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌

 సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొంటున్న నిర్ణయాలు ట్రేడ్‌ వార్‌కు దారితీస్తున్నది. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలు ఉంటాయని ఇదివరకే ప్రకటించిన ట్రంప్‌,  తాజాగా డ్రాగన్‌ దేశం చైనాకు కూడా గట్టి షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించిన ఆయన,  తాజాగా దాన్ని 20 శాతానికి పెంచారు. ఈ మేరకు కార్యనిర్వహణ ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకాలు చేశారు. ఫెంటనిల్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా విఫలమవ్వడం వల్లే టారిఫ్‌లను రెట్టింపు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇక, కెనడా, మెక్సికో దిగుమతులపై గతంలో ప్రకటించిన 25 శాతం సుంకాల నిర్ణయంపై ఎలాంటి మార్పులేదని ట్రంప్‌ తేల్చిచెప్పారు. మార్చి 4 నుంచి ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తాయన్నారు. ఫెంటనిల్‌ డ్రగ్స్‌, అక్రమ వలసదారులను నియంత్రించడంలో మెక్సికో, కెనడా ఫెయిలైయ్యాయన్న ట్రంప్‌, తన తాజా నిర్ణయంతో అమెరికాకు కంపెనీలు, పరిశ్రమలు క్యూ కడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News