అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తర్వాత పాలనలో దూకుడు కనబరుస్తున్న ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.

శాంతి భద్రతలను కాపాడాలనే లక్ష్యంతో నగరంలో భారీగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను మోహరిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఓవైపు వాషింగ్టన్ డీసీలో నేరాల శాతం భారీగా తగ్గిపోయిందని పలు నివేదికలు చెబుతున్న అధ్యక్షుడు మాత్రం లా అండ్ ఆర్డర్ కోసమని పోలీసులను మోహరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.















