నోబెల్ శాంతి పురస్కారం అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల ఎట్టకేలకు నెరవేరింది. గురువారం నాడు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది ఆయనకు నోబెల్ కమిటీ ఇచ్చిన అవార్డు కాదు, వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో ఇచ్చింది. తాను అందుకున్న నోబెల్ శాంతి బహుమతిని ఆమె ట్రంప్‌నకు ఇచ్చేశారు. ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అయిన సమయంలో నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌కు ఆమె అందజేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మచాడోనే స్వయంగా వెల్లడించారు.

నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడానికి తాను అర్హుడిని అని డోనాల్డ్ ట్రంప్ గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మచాడో నోబెల్ పురస్కారం గెలుచుకున్నప్పుడు కూడా ఆమె నాయకత్వ సామర్థ్యంపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడికి నేను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేశానని తెలిపారు.















