భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు. 75వ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు మోదీ పేర్కొన్నారు.మోదీకి బర్త్ డే విషెస్ ఫోన్ కాల్ ద్వారా తెలిపిన అనంతరం ట్రంప్ ఈ విధంగా పేర్కొన్నారు. నా ఫ్రెండ్ ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోన్‌లో మాట్లాడి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. మోదీ అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మోదీ మద్దతుకు ధన్యవాదాలు అని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. నా బర్త్ డే సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు తీసుకుంటున్న చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
















