అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ జెండర్ మహిళలకు స్పోర్ట్స్ వీసాలపై పరిమితులు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. మహిళల క్రీడల్లో పోటీ పడాలనుకునే లింగమార్పిడి మహిళల కు మీసా అర్హతను పరిమితం చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పాలసీని సవరించింది. దీని ప్రకారం పురుషుడిగా జన్మించి లింగమార్పిడి చేసుకుని మహిళల క్రీడల్లో పోటీ పడే క్రీడాకారుల దరఖాస్తులను ప్రతికూలంగా పరిగణించనుంది.

అదేవిధంగా ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి ఇచ్చే ఓ-1ఏ (O-1A) వీసాలు, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వలసదారులకు ఇచ్చే ఈబీ-1, ఈబీ-2 గ్రీన్ కార్డులు, అలాగే నేషనల్ ఇంటరెస్ట్ వేవర్స్ వంటివి ఇకపై ట్రాన్స్‌జెండర్ మహిళలకు సులభంగా మంజూరు కాబోవని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. బయాలజికల్ గుణల వల్ల పురుషులు మహిళల క్రీడలలో గెలిచే అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్ ముసుగులో వాడుకుంటున్నారని చాలా కేసుల్లో స్పష్టమైందని ఆ సంస్థ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ వెల్లడించారు. మహిళా క్రీడాకారుల భద్రత, సమానత్వం, గౌరవం, నిజం అనే ప్రమాణాలను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
















