Namaste NRI

భారత్ కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ … ఆగస్టు 1నుండి అమలులోకి

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు బిగ్ షాకిచ్చాడు. ఇకనుంచి భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఆగస్టు 1 నుండి ఇవి అమలులోకి రానున్నట్లు తెలిపాడు. రష్యాతో భారత్ చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నందుకే ఈ అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పాడు.

భారత్ మా మిత్ర దేశం అయినప్పటికీ, మేము సంవత్సరాలుగా వారితో చాలా తక్కువ వ్యాపారం చేశాం. ఎందుకంటే వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా కఠినమైన ద్రవ్యేతర వాణిజ్య అడ్డంకులను భారత్ కలిగి ఉంది. భారత్ ఎల్లప్పుడూ తమ సైనిక పరికరాలను ఎక్కువగా రష్యా నుండి కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అందరూ కోరుకుంటుండగా,  చైనాతో పాటు భారత్,  రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events