అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా తప్పుకునేలా కీలక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తున్నది. నాకు కచ్చిత మైన సమాచారముంది. ఆయన అధికారం చేపట్టిన మొదటి రోజు లేదా పాలన ప్రారంభమైన వెంటనే ఈ నిర్ణయం ఉంటుంది అని జార్జ్‌టౌన్ వర్సిటీకి చెందిన ఆరోగ్య నిపుణుడు లారెన్స్ గోస్టిన్ అన్నట్టు తెలిసింది.
డబ్ల్యూహెచ్‌వోపై మొదట్నుంచీ ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చైనా జేబు సంస్థగా మారిందని, కొవిడ్-19 సంక్షోభానికి చైనాను దోషిగా నిలబెట్టడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. రెండోసారి అధికారం చేపట్టగానే డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా ఉపసంహరణ ఖాయమన్న వార్తలు వెలువడ్డాయి. డబ్ల్యూహెచ్‌వో విమర్శ కులను అమెరికా ప్రజారోగ్యంలోని కీలక స్థానాల్ని ట్రంప్ భర్తీ చేయటం గమనార్హం. ట్రంప్ నిర్ణయంతో డబ్ల్యూహెచ్‌వో కార్యకలాపాలు ప్రభావితమవుతాయి.