
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై వాషింగ్టన్‌తో ఒక ఒప్పందానికి రాకుంటే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు. అధ్యక్షుడి హెచ్చరికలతో అప్రమత్తమైన టెహ్రాన్, క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ట్రంప్ మాట్లాడుతూ ఒకవేళ అణుఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ నిరాకరిస్తే, బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ చూడని రీతిలో దాడులు ఉంటాయి. టెహ్రాన్‌పై మరోసారి సుంకాలు విధిస్తాను అని ట్రంప్ హెచ్చరించారు.
