అణ్వాయుధాల విషయంలో ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణ్వాయుధాలను మర్చిపోవాలని తేల్చి చెప్పారు. ఒకవేళ తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి అణ్వాయుధాలను తయారుచేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధ తయారీ కేంద్రంపై సైనిక చర్యకూ వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

అణు ఒప్పందం విషయంలో టెహ్రాన్‌తో అమెరికా ఓవైపు చర్చలు జరుపుతుండగా, ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల మధ్య న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో ఇరాన్ తమను మోసం చేస్తున్నట్లు కన్పిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
