
ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయా దేశాలకు సుంకాల రేట్లు తెలియజేస్తూ లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. 150కిపైగా దేశాలకు నోటీసులు పంపించనున్నామని, అందులోనే సుంకం రేటు పేర్కొంటామని చెప్పారు. ఈ దేశాలన్నింటికీ ఒకే విధంగా సుంకాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. అవన్నీ పెద్ద దేశాలు కాదని, తమతో అంతగా వ్యాపారం చేయవని పేర్కొన్నారు. ఈ సుంకాలు 10 లేదా 15 శాతం ఉంటే అవకాశం ఉందని చెప్పారు.
















