Namaste NRI

డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్…మ‌ళ్లీ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైతే

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఒక‌వేళ మ‌ళ్లీ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైతే నియంత త‌ర‌హాలో పాలించ‌నున్న‌ట్లు చెప్పారు. రెండు ల‌క్ష్యాల కోసం తాను నియంతగా మార‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌ డించారు. త‌న‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి విచార‌ణ చేప‌డితే అప్పుడు అమెరికా స్తంభించిపోతుంద‌న్నా రు. త‌న‌ను నియంత‌గా చిత్రీక‌రిస్తూ,  విప‌క్షాలు ఓట్లు రాబ‌ట్టుకోవాల‌ని చూస్తున్నాయ‌ని ట్రంప్ అన్నారు. తానే మీ యుద్ధాలు చేయ‌లేద‌ని, విదేశాల్లో ఉన్న ద‌ళాల‌ను వెన‌క్కి ర‌ప్పించాన‌ని, కానీ అధ్య‌క్షుడు జో బైడెన్ మాత్రం యుద్ధ కాంక్ష‌నే రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా వాడుకుంటున్నార‌ని ట్రంప్ ఆరోపించారు.

ఈ ఏడాది కూడా దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ ప‌డేందుకు రిప‌బ్లిక‌న్ నేత ట్రంప్ ఆస‌క్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే క్యాపిట‌ల్ హిల్ అటాక్ కేసులో ఆయ‌న్ను దోషిగా తేల్చి దేశాధ్య‌క్ష ప‌ద‌వికి దూరంగా చేయాల‌ని డెమోక్రాట్లు ప్ర‌య‌త్నిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events