Namaste NRI

నాగబంధం నుంచి సెకండ్ సింగిల్.. ఎప్పుడంటే

దర్శకుడు అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్న చిత్రం నాగబంధం: ది సీక్రెట్‌ ట్రెజర్‌. విరాట్‌ కర్ణా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్‌, సాంస్కతిక అంశాలు ఉన్నాయి. ఈ చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌ సుర సుర (తెలుగు)ను ఈనెల 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.సుర సు పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. భారీ సెట్స్‌, గ్రాండ్‌ విజువల్స్‌, ఎనర్జిటిక్‌ పెర్ఫార్మెన్స్‌లతో ఈ పాట సినిమా లో ఒక మెయిన్‌ హైలెట్‌గా నిలవనుంది.ఈ పాటకు సంగీతాన్ని జునైద్‌ కుమార్‌, అభే అందించగా, ఫోక్‌ ఎలి మెంట్స్‌ను సినిమాటిక్‌ ఆర్కెస్ట్రేషన్‌తో కలిపి ఫెస్టివ్‌ సాంగ్‌గా తీర్చిదిద్దారు. గణేష్‌ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత జోష్‌ తీసుకురానుంది.

అనురాగ్‌ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్‌ వంటి గాయకులు ఈ పాటకు వోకల్స్‌ అందించారు. కాసర్ల శ్యామ్‌ రాసిన సాహిత్యం వేడుకలు, సంప్రదాయం, కలిసికట్టుగా ఉండే ఆనందాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. నిక్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై కిషోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగి రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్‌, ఐశ్వర్యా మీనన్‌, రిషబ్‌ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్‌, మహేష్‌ మంజ్రేకర్‌ తదితరులు ముఖ్యతారాగణం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events