Skip to main content

Namaste NRI

హంగేరీలో ఊహించని పరిణామం .. నూతన ప్రధానిగా పీటర్ మాగ్యార్

యూరప్ రాజకీయాల్లో అగ్రదేశమైన హంగేరీలో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా తిరుగులేని నేతగా ఏకఛత్రాధిపత్యం వహించిన ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌కు అక్కడి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ నేత, 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ నేతృత్వంలోని తిస్సా పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతో హంగేరీ నూతన ప్రధానిగా పీటర్ మాగ్యార్ ఎన్నికయ్యారు.

మొత్తం 199 స్థానాలున్న హంగేరీ పార్లమెంటుకు 97.35 శాతం ఓట్లలో, టిస్జా పార్టీ ఏకంగా 53.6 శాతం ఓట్లతో 138 సీట్లను కైవసం చేసుకుని, మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన జేడీ వాన్స్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా, డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక మద్దతు ఇస్తామని ప్రకటించినా ఓర్బన్‌ను ప్రజలు గెలిపించకపోవడం గమనార్హం.

Social Share Spread Message

Latest News