Namaste NRI

విశ్వక్‌సేన్ కొత్త సినిమా ప్రారంభం

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా ఓ న్యూఏజ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందుతున్నది. రజత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి విశ్వక్‌సేన్‌ సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. మహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు కొరటాల శివ క్లాప్‌ కొట్టగా, అగ్ర నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్‌ చేసి, స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. యువతరం మెచ్చే కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతున్నదని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్‌ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: భాను భోగవరపు, నందు సవిరగాన, కెమెరా: అరవింద్‌ విశ్వనాథన్‌, సంగీతం: తేజస్‌ కృష్ణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events