అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల పర్వంలో ఈసారి పనామా కాలువ వంతు వచ్చింది. పనామా కాలువను ఉపయోగించుకునే అమెరికన్ నౌకలకు మితిమీరిన ఛార్జీలను వసూలు చేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ నావికా దళం, వాణిజ్యాలను అత్యంత అన్యాయంగా చూస్తున్నారని మండిపడ్డారు. పనామా పట్ల అమెరికా అసాధారణమైన దాతృత్వాన్ని ప్రదర్శించిందని, అయినప్పటికీ పనామా వసూలు చేస్తున్న ఛార్జీలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కాలువపై నియంత్రణను అప్పగించడంలోని నైతిక, చట్టపరమైన నిబంధనలను పాటించకపోతే కాలువను పూర్తిగా తిరిగి తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తామన్నారు.