అనురూప్‌రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రేమించొద్దు. శిరిన్ శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ బస్తీ నేపథ్య ప్రేమ కథ ఇది.నేటి యువత ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోకుండా తప్పటడుగులు వేస్తున్నారు. అది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ఈ అంశాన్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాం. వాస్తవ సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నా అన్నారు.
పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: హర్ష కొడాలి, సంగీతం: జునైద్ కుమార్, రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శకత్వం: శిరిన్ శ్రీరామ్.