అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రేమించొద్దు. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శిరిన్ శ్రీరామ్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ప్రతి పాత్ర సహజంగా అనిపిస్తుంది.
నిజ జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన సినిమా. సందేశాత్మక కథతో ఆకట్టుకుంటుంది అన్నారు. ప్రతీ సన్నివేశం రియలిస్టిక్‌గా ఉంటుందని హీరో అనురూప్ రెడ్డి తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలకానుంది. తెలుగులో జూన్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: హర్ష కొడాలి, సంగీతం జునైద్ కుమార్, రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శకత్వం: శిరిన్ శ్రీరామ్.