కథానాయిక సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. విడాకుల అనంతరం తాత్విక అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న ఈ భామ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన వైవాహిక జీవితం గురించి కామెంట్స్ చేశారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేంటో వివరించారు. నా ఇష్టాలను గుర్తించడంలో విఫలమయ్యాను.
ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎందుకంటే గతంలో నా భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు. క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైంది. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల ప్రారంభమైంది అన్నారు. సమంత మీడియాతో మాట్లాడుతూ తన విడాకు లు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయానని చెప్పారు. ఒకవైపు ఆరోగ్యం దెబ్బ తింటుంటే, మరోవైపు వైవాహిక బంధం ముగిసిందని తెలిపారు. ప్రస్తుతం సినిమా లకు విరామం ప్రకటించిన సమంత తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు.