సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం దూరదర్శిని. కలిపింది ఇద్దరిని అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. బి.సాయిప్రతాప్‌రెడ్డి, జయశంకర్‌రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నా యి. 1990 నేపథ్యంలో సాగే పీరియాడిక్ ప్రేమకథ చిత్రం.హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి ఆర్పీ పట్నాయక్ శుభాకాంక్షలు అందించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకులా ఈ ప్రేమకథ ఉంటుందని, హీరో సువిక్షిత్ బొజ్జ తెలిపారు. ఇంకా కథానాయిక గీతిక రతన్, నటుడు జెమిని సురేశ్ కూడా మాట్లాడారు. లావణ్యరెడ్డి, కిట్టయ్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్ గుర్రాన.