Namaste NRI

వాషింగ్టన్ డీసీలో డా.సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సిలో  ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తానా, పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా  ప్రముఖ రచయిత్రి దివాకర్ల రాజేశ్వరి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులుగా, అధికార భాషా సంఘ అధ్యక్షులుగా, సినీ గేయ రచయితగా అనేక బాధ్యతలు సినారె నిర్వహించారని అన్నారు. తెలుగు సాహిత్యంలో, మకుటం లేని మహారాజుగా వెలుగొందారని ప్రశంసించారు. తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించటమే కాక, అనేక నూతన ప్రక్రియలను ఆవిష్కరించి, తెలుగు సాహితీ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. మానవుడు ప్రకృతిపై ఆధిపత్యం సాధించాలనే తపన అనేక అనర్థాలకు కారణమయ్యిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నక్షత్రం వేణు, వనమా లక్ష్మి నారాయణ, పునుగువారి నాగిరెడ్డి, బండి సత్తిబాబు, దుగ్గి విజయ భాస్కర్, చల్లా సుబ్బారావు,  మేకల సంతోష్ రెడ్డి, సామినేని వెంకటేశ్వరరావు, పయ్యావుల చక్రవర్తి, చామర్తి శ్రావ్య, కొత్తూరి కామేశ్వరరావు, బోనాల రామకృష్ణ, చిట్టెపు సుబ్బారావు, చెరుకూరి ప్రసాద్,  పలువురు ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events