అమెరికా హెచ్-1బీ వీసా లాటరీ కోసం ఈ ఏడాది దాదాపు 40 శాతం తక్కువ దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సిటిజన్‌షిప్ ఆండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. 2023 లో 7,58,994 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 4,79,342 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపింది. కాగా, దరఖాస్తు చేసిన ఉద్యోగాల సంఖ్య మాత్రం దాదాపుగా గత ఏడాదితో సమానంగా ఉంది. ఇంతకుముందు హెచ్-1బీ లాటరీ కోసం మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకునే పద్ధతి ఉండేది. తర్వాత ఎలక్ట్రానిక్ పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే, కొన్ని కంపెనీలు, వ్యక్తులు ఈ పద్ధతిని దుర్వినియోగం చేసి డుప్లికేట్ దరఖాస్తులు చేస్తున్నారని యూఎస్‌సీఐ ఎస్ గుర్తించింది. దీంతో ఈసారి ఒక్కరు ఒకే దరఖాస్తు చేసే విధానాన్ని అమలు చేసింది. దీంతో దరఖాస్తులు భారీగా తగ్గినట్టు భావిస్తున్నారు.