Namaste NRI

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా.. రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

రిచర్డ్‌ రిషి హీరోగా ద్రౌపది 2 పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. రక్షణ ఇందుచూడన్‌ ఇందులో టైటిల్‌రోల్‌ని పోషిస్తున్నది. మోహన్‌.జి దర్శకుడు. చోళ చక్రవర్తి నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. ప్రమోషన్‌లో భాగంగా ద్రౌపదిదేవి పాత్ర పోషిస్తున్న రక్షణ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె గాంభీర్యంగా, హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టు, బొట్టు, ఆహార్యం ఆకట్టుకునేలా ఉంది. నేపథ్యంలో కనిపిస్తున్న సెట్‌ వర్క్‌ చూస్తుంటే సినిమా స్థాయి అర్థమవుతున్నది. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. నట్టి నటరాజ్‌, వై.జి.మహేంద్రన్‌, నాడోడిగల్‌ భరణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పద్మ చంద్రశేఖర్‌, కెమెరా: ఫిలిప్‌ ఆర్‌.సుందర్‌, సంగీతం: గిబ్రాన్‌ వైబోధ, నిర్మాణం: జి.ఎం.ఫిల్మ్‌ కార్పొరేషన్‌, నేతాజీ ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News