మమ్ముట్టి నటిస్తున్న చిత్రం టర్బో. ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో మమ్ముట్టి బ్లాక్ షర్ట్, తెలుపు లుంగీలో షార్ట్ హెయిర్, కోరమీసాలతో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. టర్బో చిత్రాన్ని జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేయగా, మమ్ముట్టి జీపుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా ముందుగా థియేటర్లలో సందడి చేయనుంది. మే 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వైశాక్ ఫిల్మ్ బ్యానర్‌పై వస్తోన్న ఈ చిత్రానికి మిధున్ మాన్యుయెల్ థామస్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మమ్ముట్టి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తుండటంతో మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది.