తెలంగాణ, కజకిస్థాన్‌ల మధ్య సత్ససంబంధాల బలోపేతానికి కృషిచేస్తున్నట్టు కజకిస్థాన్ గౌరవ కాన్సుల్ హెచ్‌ఈ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ అన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కజకిస్థాన్‌కు విమానాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తునట్టు చెప్పారు. కజకిస్థాన్ కాన్సులేట్ 3వ వార్షికోత్సవం సందర్భంగా మాదా పూర్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మూడేండ్ల కాలంలో అనేక మైలురాళ్లను తమ ఖాతాలో వేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ, రిపబ్లిక్ ఆఫ్ టర్కీ కాన్సులేట్ జనరల్ హెచ్‌ఈ ఓర్హాన్ యల్మాన్ ఓకాన్, యూఏవో కాన్సుల్ జనరల్ హెచ్ ఈ ఆరీఫ్ అల్నూయి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.