Namaste NRI

టీఆర్‌ఎస్‌ ఆస్ట్రియా నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మమేష్‌ బిగాల యూరప్‌లోని వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆస్ట్రియా దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నారైలతో సమావేశమై కేసీఆర్‌ నూతన జాతీయ పార్టీకి మద్దతు కూడా కట్టారు. ఈ సందర్భంగా ఆస్ట్రియా నూతన కార్యవర్గం ప్రకటించారు.

 నూతన కార్యవర్గం ఇదే :

 ప్రెసిడెంట్‌గా అనుమండ్ల లక్ష్మా రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌గా కోరండ్ల ప్రవీణ్‌, జనరల్‌ సెక్రటరీగా బొల్లాడి లక్ష్మా రెడ్డి, సెక్రటరీగా కృష్ణ కుమార్‌, ఐటీ సెక్రటరీగా రంగు మహేష్‌ గౌడ్‌, కోశాధికారిగా సంగేడు శ్రీనివాస్‌ గౌడ్‌, స్పోక్స్‌ పర్సన్‌గా దోర్నాల సంతోష్‌ కుమార్‌, ఫౌండర్‌ ప్రెసిడెంట్‌గా మేడిపల్లి వివేక్‌ రెడ్డి నియమితులయ్యారు.ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం స్వయంగా వచ్చి టీఆర్‌ఎస్‌ ఆస్ట్రియా శాఖని ప్రారంభించామని గుర్తు చేశారు. నాడు మేడిపల్లి వివేక్‌ ప్రెసిడెంట్‌గా మొదటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు ఐదవ కార్యవర్గాన్ని ప్రకటించామని తెలిపారు. నూతన జాతీయ పార్టీ కోసం షోషల్‌ మీడియాలో ఇంకా చాలా ఆక్టివ్‌గా పని చేయాలని సూచించారు. దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events