Namaste NRI

ఖతార్‌లో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావం సభ.. భారీగా హాజరైన ప్రవాసులు

ఖతార్ లో ఎన్నికల శంఖారావం సభ ఎన్ఆర్ఐ  తెలుగుదేశం, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రవాసులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేసారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ప్రారంభమైన సభ, తెలుగుదేశం, జనసేన జండాలతో, అద్భుతమైన నాయకుల ప్రసంగాలతో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా  జనసేన కన్వీనర్ జికె దొర మాట్లాడుతూ  పొత్తులో భాగంగా ఎన్నిసీట్లలో ఎవరు ఎక్కడనుంచి పోటీచేయాలో అధినాయకులు నిర్ణయిస్తారని, జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచి పార్టీని బలోపే తం చేయవలసిన బాధ్యత ప్రతివక్క జనసైనికుడిదని, రాబోయే ఎన్నికలు, కని వినీ యెరుగని రీతిలో జరుగు తాయని,  అందరంకలసికట్టుగా పోరాడితే తప్పా కూటమి గెలుపు సాధ్యంకాదని పిలుపునిచ్చారు. జనసేన ఆవిర్భావ చారిత్రిక అవసరాన్ని గుర్తు చేశారు. 

ఖతార్ తెలుగుదేశం అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ ఖతార్ తెలుగుదేశం అందించిన సేవల ను గుర్తుచేశారు. ఆపదలలో ఉన్న 17 మందికి మెడికల్ సహాయం చేయుటలో సహకరించిన వారికీ, అలాగే ఎన్టీఆర్ కాంటీన్లకు సహకరించినవారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసారు. రాబోయే ఎన్నికలలో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకమనీ, ప్రతిఒక్క ప్రవాసుడు తన జన్మభూమి ఋణం తీర్చుకొనే సమయం ఆసన్న మైందని, తప్పక తమవంతు సేవ రాష్ట్రానికి అందించాలని, తెలుగుదేశం,  జనసేన అభ్యర్థులను గెలిపించు టకు శ్రమించాలని విజ్ఞప్తి చేసారు.

ఎన్ఆర్ఐ టీడీపీ ఉపాధ్యక్షులు మద్దిపోటి నరేష్, జీసీసీ కౌన్సిల్ మెంబెర్ మల్లిరెడ్డి సత్యనారాయణ, సీనియర్ లీడర్ శాంతయ్య యలమంచిలి, ఆంజనేయులు ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికలలో ప్రతివక్క ప్రవాసుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, తమ స్నేహితులు, బంధువులు, తెలిసినివారందరిని ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని అభ్యర్ధించారు. ఒకసారి చేసిన తప్పుకు రాష్ట్రం 30 సంత్సరాలు వెనకకు నెట్టబడిందని,  ఈసారి యాదమరిస్తే ఆంధ్రరాష్ట్రంలో మట్టికూడా మిగలదని హెచ్చరించారు.

ఎన్ఆర్ఐ  టీడీపీ ప్రధాన కార్యదర్శి రవి పొనుగుమాటి, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ రమేష్ దాసరి, రవీంద్ర, రజని, నాయుడు, రమణ కుమార్, సాయి మోహన్ వారాధిగారి తదితరులు ప్రసంగిస్తూ  రాబోయే ఎన్నికల కదన రంగంలో తమసత్తా చాటటానికి ప్రవాసులు సంసిద్ధంగా ఉన్నారని,  ఈ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర భవితకు, భావిపౌరుల బౌషత్తుకు సంభంధించినవాని.. అభిరుద్ది, సంఖేమం, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ కల సిద్ధమవ్వాలంటే కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులై కౌరవసేన వైసీపీ ని తుదనట్టించి ఆంధ్రరాష్ట్రాన్ని కాపాడటానికి సంసిద్దులై ఉన్నారని,  వారికీ మనం చేయూతనిచ్చి అండగా నిలువవలిసిన సమయం ఆసన్నమైనదని ఉద్ఘాటించారు.

జనసేన కన్వీనియర్ సత్యం మెడిది, సీనియర్ మెంబెర్స్ వీరబాబు లోవిశేట్టి, సుధాకర్ నందిగాము, మల్లికార్జు న, గౌతమ్, అనిల్, నగేష్ తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన బంధం శాశ్వితమని, ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన వాటిని  తిప్పికొట్టడానికి తమ అధినేతలు, కార్యకర్తలు సంసిద్దమని, హలో ఏపీ.. బై బై   వైసీపీ అని నినదించారు.   సభానిర్వహణలో సహకరించిన సీనియర్ లీడర్ శాంతయ్య యలమంచిలి, రవి పొనుగుమాటి, సాయి మోహన్, రమేష్ దాసరి, రవీంద్ర, రజని, కళ్యాణ్ తదితరులకు  కృతజ్ఞతలు తెలియచేసారు. జై టీడీపీ,  జై జనసేన నినాదాలతో సభను దిగ్విజయంగా ముగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events