ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇకపై ట్విట్టర్‌లో కంటెంట్ క్రియేటర్లు పెయిడ్ సబ్‌స్ర్కైబర్లను చేర్చుకొని ఆదాయాన్ని పొందవచ్చని ప్రకటించారు. సుదీర్ఘ వీడియోలు, టెక్ట్స్‌కు యాక్సెస్ ఇవ్వడానికి సబ్‌స్ర్కైబర్లను చేర్చుకోవచ్చని మస్క్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వచ్చే ఆదాయంలో 12 నెలల పాటు ట్విట్టర్ ఎలాంటి వాటా తీసుకోదని, మొత్తం క్రియేటర్లకు ఇచ్చేస్తామని మస్క్ తెలిపారు.


ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లు వినియోగించే సబ్‌స్ర్కైబర్ల నుంచి క్రియేటర్లకు 70 శాతం వస్తుందని, మిగతా 30 శాతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫీజుగా తీసుకుంటాయని పేర్కొన్నారు. వెబ్‌లో వాడే సబ్‌స్ర్కైబర్ల నుంచి 92 శాతం వరకు ఆదాయం కంటెంట్ క్రియేటర్లకే వస్తుందని, పేమెంట్ ప్రాసెసర్లు కొంత మొత్తం చార్జ్ చేస్తాయని తెలిపారు.
