ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకున్నారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఎక్స్ లో తన పేరును మస్క్‌కు బదులుగా కేకియస్ మాక్సిమస్ గా మార్చుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆ పేరుకు అర్థం ఏంటా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే, కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్. పలు బ్లాక్ చెయిన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇది అందుబాటులో ఉంది.