
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యన్ శాసన సభ్యుడి ఆఫర్ ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మస్క్ రష్యాలో రాజకీయ ఆశ్రయం కోరవచ్చని సూచించారు. అమెరికా అధ్యక్షుడితో వివాదం నేపథ్యంలో స్టేట్ డూమా కమిటీ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్) యొక్క మొదటి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి నోవికోవ్ ఈ ప్రకటన చేశారు. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడుతున్నాడి, అతడికి ఎలాంటి రాజకీయ ఆశ్రయం అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయితే, అతను కోరితే రష్యా ఆశ్రయం అందించగలదు అని చెప్పాడు.
