
ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన ప్రధాని మోదీకి టెస్లా అధినేత, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప్రధాని మోదీకి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ నెల 14న ఎక్స్‌లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. దీంతో ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన జాబితాల్లో అగ్రస్థానంలో నిలిచారు.
