ఎక్స్ సోషల్ మీడియా సంస్థ ఓనర్ ఎలన్ మస్క్ ఓ కీలక ప్రటకన చేశారు. ఆదాయం గురించి ఆలోచించే జర్నలిస్టులకు ఆయన ఓ ఆఫర్ ఇచ్చారు. తమ స్టోరీలను నేరుగా ఎక్స్ మీడియా అకౌంట్లో పబ్లిష్ చేయాలని ఆయన జర్నలిస్టుల్ని కోరారు. అలాంటి జర్నలిస్టులకు ఆదాయం అధిక స్థాయిలో ఉంటుందని, మరింత స్వేచ్ఛతో కథలను రాసుకోవచ్చన్నారు. మీడియా పబ్లిషర్స్‌కు కూడా మస్క్ ఇటీవల ఓ ప్లాన్ ప్రకటించారు. కథనాలను పబ్లిష్ చేసే సంస్థలు, వాటిని చదివే యూజర్ల నుంచి ఛార్జీలు వసూల్ చేయాలని ఆయన సూచించారు. వార్తా కథనాల ఆధారంగా యూజర్ల నుంచి ఛార్జీలను వసూల్ చేయాలని, ఒకవేళ యూజర్లు సైనప్ చేయకుంటే, వారి నుంచి మరింత అధికంగా ఛార్జీ వసూల్ చేయాలని మస్క్ సూచించారు.














