ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, ప్రజావేగు సుచిర్ బాలాజీ మృతి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని, కేసును ఎఫ్‌బీఐకి అప్పగించాలని సుచిర్ తల్లి పూర్ణిమారావు డిమాండ్ చేశారు. మేం ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించాం. రెండోసారి శవ పరీక్ష నిర్వహించాం. నా కొడుకు చావుకి ఆత్మహత్య కారణం కాదని డాక్టర్లు పేర్కొన్నారు. నా కొడుకుది క్రూరమైన హత్య అని ఆమె తెలిపారు. తన కొడుకు అపార్ట్‌మెంట్‌ను దోచుకున్నా రని, అతడి బాత్‌రూమ్‌లో రక్తపు మరకలు కనిపించాయని ఆమె వెల్లడించారు. తన ట్వీట్‌ను ట్రంప్ ప్రభుత్వంలో భాగస్వాములు కానున్న మస్క్, వివేక్ రామస్వామిలకు ఆమె ట్యాగ్ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ సుచిర్‌ది ఆత్మహత్యలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.