Namaste NRI

ఇజ్రాయెల్‌లోని భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం ఐదునెలలకుపైగా కొనసాగుతున్నది. ఈ యుద్ధానికి ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరింది. ఇజ్రాయెల్‌ – లెబనాన్‌ సరిహద్దుల్లో నిర్వహించిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా,  ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అడ్వైజరీ ని జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు, ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం సూచిం చింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ అధికారులతో సంప్రదింపులు జరిపి, భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News