Namaste NRI

పతంగ్ నుంచి ఎమోషనల్ డ్రామా సాంగ్

పతంగుల పోటీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా పతంగ్‌. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రణీత్‌ పత్తిపాటి దర్శకుడు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నది. ఈ సినిమా నుంచి ఎమోషనల్‌ డ్రామా అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డి.సురేష్‌బాబు మాట్లాడుతూ పతంగుల పోటీ నేపథ్యంలో సరికొత్త కాన్సెప్ట్‌ ఇదని, నిర్మాణపరంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ కథ అందరికి నచ్చుతుందని నిర్మాతల్లో ఒకరైన నాని బండ్రెడ్డి పేర్కొన్నారు. కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా యూత్‌ఫెస్టివల్‌ గా ఆకట్టుకుంటుందని నిర్మాతలు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News