ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ తయారీ సంస్థ నైకీ 1600 మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో 2 శాతం మందిని తొలగిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. సంస్థలో ప్రస్తుతం 83,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యయ నియంత్రణలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తు న్నట్టు కంపెనీ తెలిపింది. భవిష్యత్తు విక్రయాల అంచనాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో, వృద్ధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నది.