Namaste NRI

కోపం చాలు శ్రీమతిగారు..భార్యను బ్రతిమాలు కుంటున్న లక్కీ భాస్కర్‌

దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్‌. మీనాక్షి చౌదరి కథానాయిక.  వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో శ్రీమతి గారు  అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరపరచిన ఈ మెలోడీ గీతం వినసొంపుగా సాగింది. శ్రీమణి సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని విశాల్‌ మిశ్రా, శ్వేతా మోహన్‌ ఆలపించారు. కోపాలు చాలండి శ్రీమతిగారు కొంచెం కూల్‌ అవ్వండి మేడం గారు అంటూ కోపంతో అలిగిన భార్యను బుజ్జగిస్తూ భర్త పాడే ఈ పాట అందమైన భావాలతో సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది.

 1980-90 దశకంలో అసాధారణ విజయాలను సాధించిన ఓ బ్యాంక్‌ క్యాషియర్‌ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: నిమిష్‌ రవి, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Social Share Spread Message

Latest News