యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతో కలిసి ఉమ్మడిగా చేపట్టనున్న మార్స్ మిషన్ ఎక్సోమార్స్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ అష్బాచెర్ ఈ మేరకు తెలిపారు. ఈఎస్ఏ అంతరిక్ష కార్యక్రమాలపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం గురించి తమ సభ్య దేశాలు గత రెండు రోజులుగా చర్చించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యాతో కలిసి ఈ ఏడాది సెప్టెంబర్లో చేపట్టాల్సిన ఎక్స్మార్స్ ప్రయోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అవసరమైనది కూడా అని పేర్కొన్నారు. ఈ ప్రయోగంపై ముందుకు వెళ్లే మార్గాలపై సమాలోచన చేస్తామని ఆయన వెల్లడిరచారు.














