Skip to main content

Namaste NRI

ఈఎస్‌ఏ మరో కీలక నిర్ణయం

యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతో కలిసి ఉమ్మడిగా చేపట్టనున్న మార్స్‌ మిషన్‌ ఎక్సోమార్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ జోసెఫ్‌ అష్‌బాచెర్‌ ఈ మేరకు తెలిపారు. ఈఎస్‌ఏ అంతరిక్ష కార్యక్రమాలపై ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం గురించి తమ సభ్య దేశాలు గత రెండు రోజులుగా చర్చించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యాతో కలిసి ఈ ఏడాది సెప్టెంబర్‌లో చేపట్టాల్సిన ఎక్స్‌మార్స్‌ ప్రయోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అవసరమైనది కూడా అని పేర్కొన్నారు. ఈ ప్రయోగంపై ముందుకు వెళ్లే మార్గాలపై సమాలోచన చేస్తామని ఆయన వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News