Namaste NRI

దీపావళి పండుగ సందర్భంగా..యుఫోరియా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నూతన నటీనటులతో అగ్ర దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న యూత్‌ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ యుఫోరియా. భూమిక చావ్లా, సారా అర్జున్‌, నాజర్‌, రోహిత్‌, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్‌, కల్పలత, సాయిశ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవి ప్రకాశ్‌, నవీనారెడ్డి, లికిత్‌ నాయుడు ముఖ్య పాత్రధారులు. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని మేకర్స్‌ చెబుతున్నారు.

డిసెంబర్‌ 25న సినిమా విడుదల కానున్నదని తెలియజేస్తూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని దీపావళి పండుగ సందర్భంగా మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఓవైపు భూమిక నవ్వుతూ కనిపిస్తున్నది. మరోవైపు పిల్లాడితో ఆడుతూ కనిపిస్తున్నది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా అని, ఇందులో వినోదంతోపాటు చక్కని సందేశం కూడా ఉంటుందని గుణశేఖర్‌ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: నాగేంద్ర కాశి, కృష్ణహరి, కెమెరా: ప్రవీణ్‌ కె.పోతన్‌, సంగీతం: కాలభైరవ, సమర్పణ రాగిణి గుణ, నిర్మాతలు: నీలమ గుణ, యుక్తా గుణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events