Namaste NRI

ఆయనతో ఒక్క సినిమా చేసినా..అది వంద సినిమాలతో సమానం

పవన్‌కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ నటించిన చిత్రం  హరిహరవీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకులు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్‌ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకుంది. పవన్‌కల్యాణ్‌ వంటి తిరుగులేని స్టార్‌డమ్‌ ఉన్న హీరోతో కలిసిన నటించడం గొప్ప అదృష్టమని, ఆయనతో ఒక్క సినిమా చేసినా అది వంద సినిమాలతో సమానమని చెప్పింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు పంచమి. తను చాలా శక్తివంతురాలు. ఎలాంటి సవాలులైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండే ధైర్యశాలి. నా పాత్ర భిన్న కోణాలతో ఆసక్తికరంగా సాగుతుంది అని నిధి అగర్వాల్‌ పేర్కొంది.

మొఘల్‌ సామ్రాజ్య నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథను రాశారని, ఇందులో పవన్‌కల్యాణ్‌ రాబిన్‌హుడ్‌ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిపింది. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ సన్నివేశం ఉంటుందని, అందులో అభినయించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని చెప్పింది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News