రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన సినిమాలో నట దర్శకుడు ఎస్.జె.సూర్య కీలక పాత్రధారి. ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎస్.జె.సూర్య విలేకరులతో మాట్లాడారు. శంకర్‌గారికి సలహాలిచ్చే స్థాయి నాకు లేదు. ఆయన విజనరీ. రాజమౌళి లాంటి వాళ్లే ఆయన్ను ఆదర్శంగా భావిస్తారు. అందుకే ఆయన చెప్పింది చెప్పిన ట్టు చేసుకుంటూ వెళ్లాను. నా నటన చూసి ఇంప్రస్ అయ్యి, ఇండియన్ 2 లో నాకు అవకాశం ఇచ్చారు. శంకర్‌సార్ డైరెక్షన్‌లో చేయడం ఓ గొప్ప వరం అని చెప్పారు. రామ్‌చరణ్‌లోని గొప్ప నటుడ్ని ఈ సినిమాలో చూస్తారని, ఐఏఎస్ రామ్‌నందన్‌గా, అప్పన్నగా రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తారని, ముఖ్యంగా అప్పన్న లైఫ్ టైమ్ గుర్తిండి పోయే పాత్ర అని తెలిపారు. ఓ అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికీ, ఓ నిజాయితీ పరుడైన ఐఏఎస్‌కీ జరిగే యుద్ధమే గేమ్ ఛేంజర్. ఈ యుద్ధాన్ని శంకర్ ఎంత బాగా తీశారో థియేటర్లలో చూస్తారు. చాలా ప్రిపేర్ అయ్యి ఈ పాత్ర చేశాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా కష్టం అనిపించింది. తెలుగు, తమిళ, హిందీ అన్ని భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పా. నేను ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర ఇది అనిసూర్య చెప్పారు.