బీహార్‌లో ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా నితీశ్ కుమారు, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ వేదిక కానుంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు గాను 202 సీట్లలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఇందులో బీజేపీకి 89, నితీశ్ కుమార్‌కు చెందిన జేడీ(యూ)కు 85, కూటమి పార్టీలైన ఎల్‌జేపీ (రామ్ విలాస్)కి 19, హెచ్‌ఏఎం 5 , ఆర్‌ఎల్‌ఎస్‌పీ 4 సీట్లలో గెలుపొందాయి. దీంతో బీహార్‌లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడానికి సిద్ధమైంది.
















