అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం వారు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఓ ప్రవాస భారతీయుడు ప్రధానిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మేరీలాండ్కు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి కారు నంబర్ ప్లేట్‌పై చీవీశీసఱ అని రాయించారు. నేను 2016లోనే ఈ ప్లేట్‌ను సిద్ధం చేసుకున్నాను. ప్రధాని మోదీ నాకొక స్ఫూర్తి. సమాజం, దేశం, ప్రపంచం కోసం ఏదైనా మంచి చేయాలనే ప్రేరణను ఆయన నుంచి పొందాను. ఇప్పుడు ప్రధాని ఇక్కడికి వస్తున్నారు. ఆయన్ను ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నాను అని రాఘవేంద్ర అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ జూన్ 21 నుంచి 24 వరకు అక్కడ పర్యటించనున్నారు.


