
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. బ్రూనై పర్యటనను ముగించుకొని, సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోదీ ఢోలు వాయించారు.
