నితిన్ తాజా చిత్రానికి ఎక్స్‌ట్రా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆర్డినరీ మేన్ ఉపశీర్షిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్యమూవీస్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బాగా పెరిగిన జుట్టు, గుబురు గడ్డంతో నితిన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్ ఇది. యాక్షన్, కామెడీ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నితిన్ పాత్ర రెండు భిన్న కోణాల్లో మెప్పిస్తుంది. కథలోని మలుపులు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయి అని చెప్పారు. అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి హరీష్‌జైరాజ్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
