రజనీకాంత్ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండిరటిని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మరి వీటికి దర్శకులెవరూ అనే విషయంలో ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆయన కుమార్తు ఐశ్వర్య పేరు వినిపిస్తోంది. ఆమె దర్శకత్వంలో నటించడానికి కథ సిద్ధమైనట్టు సమాచారం. ఐశ్వర్య చెప్పిన కథ రజనీతో పాటు లైకా సంస్థకు కూడా బాగా నచ్చిందట. ఈ రెండు సినిమాలు ఈ నెల మొదలుకానున్నాయి. ఆ రోజున దర్శకుల విషయంలో పూర్తి స్పష్టత వస్తుంది.
గతంలో మరో కుమార్తె సౌందర్య దర్శకత్వంలో కొచ్చడయాన్ సినిమాలో నటింంచారు రజనీ. అన్నీ కున్నట్టే జరిగితే ఐశ్వర్య కూడా తండ్రి సినిమాకు దర్శకత్వం వహించే గొప్ప అవకాశం దక్కినట్టే.














