సుమ చిత్ర ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రం డియర్ ఉమ. పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి నాయకానాయికలుగా నటిస్తున్నారు. సాయిరాజేష్ మహదేవ్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్థార్థ్ రెడ్డి క్లాప్‌నివ్వగా, రాప్తాడుఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ కథతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. మనందరి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నా. చక్కటి సందేశంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాం అన్నారు. హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ నేను ముందుగా దియా అనే కన్నడ చిత్రంలో నటించాను. తెలుగులోనూ అనువాదమై మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు డియర్ ఉమ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డియర్ ఉమ కథ చాలా బావుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరి. మంచి మెసేజ్ ఉంటుంది. అందరికీ థాంక్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర టీమ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: రధన్, కథ, నిర్మాత: సుమయా రెడ్డి, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: సాయిరాజేష్ మహదేవ్.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-124.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-117.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-118.jpg)