రామ్జ్, మాయా కృష్ణన్ ప్రధాన పాత్రల్లో రన్‌వే ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ఫైటర్ రాజా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణప్రసాద్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, చక్రధర్, శివనందు, రోషన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యువహీరోలు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఆవిష్కరించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథ ఇదని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చుతుందని దర్శకుడు కృష్ణప్రసాద్ తెలిపారు. వినూత్న కథాంశంతో యంగ్ టీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత దినేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీధర్ కాకిలేటి, సంగీతం: సమ్రన్ సాయి, రచన-దర్శకత్వం: కృష్ణప్రసాద్.
